టీడీపీ దోపిడీకి అడ్డూ అదుపు లేదు

తప్పుడు పాసుబుక్కులతో వందల కోట్ల దోపిడీ
వేరుశనగ నూనెను రేషన్‌ సరుకుల్లో అమ్మలేరా
మంత్రికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్న
భూమి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కేశంనాయక్‌
రైతు కుటుంబానికి అండగా నిలిచిన వైయస్‌ఆర్‌ సీపీ
రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా, పిల్లలను చదివిస్తానని మిథున్‌రెడ్డి హామీ

అనంతపురం: తెలుగుదేశం పార్టీ దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. తహసీల్దార్, గ్రామ కార్యదర్శులతో దొంగ పాసుబుక్కులు సృష్టించి సబ్సిడీ ద్వారా వందల కోట్లు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం వేదికగా వైయస్‌ఆర్‌ సీపీ తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ప్రకాష్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు తమ్ముళ్ల దోపిడీకి అనేక మంది రైతులు భూమిని కోల్పోయారన్నారు. చంద్రబాబు 271 జీఓ విడుదల చేసిన తరువాత అడంగల్స్‌లో ఈ రోజు ఒక పేరుంటే.. రేపు ఇంకొకరి పేరు ఉంటుందన్నారు. అలా భూములు కోల్పోయినవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మకూరుకు చెందిన రైతు కేశంనాయక్‌ టీడీపీ నేతల భూదోపిడీలో భూమిని కోల్పోయాడని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆ రైతు కుటుంబానికి న్యాయం చేయాలని చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు. బాధితుల పక్షాన పోరాడుతున్న వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై ఎమ్మార్వోను దూసించారని తప్పుడు కేసులు బనాయించారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనకు ఇదే నిదర్శనమన్నారు. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచింది. బాధితులకు భరోసాగా పార్టీ రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రకటించారు. అదే విధంగా మృతుడి పిల్లలకు చదువులకయ్యే ఖర్చు మొత్తం బరిస్తానని మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు రైతు వ్యతిరేక పాలనకు సమాధానం చెప్పాలని ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ జగన్‌ కష్టపడుతున్నారని, రాబోయేది వైయస్‌ జగన్‌ ప్రభుత్వమేనని, జననేతను ముఖ్యమంత్రిని చేసుకునే వరకు అనంత రైతులు నిద్రపోరన్నారు. 

అనంత రైతులు పండించిన వేరుశనగ నూనెను రేషన్‌ దుకాణాల్లో అమ్మి ఉంటే ఆ రైతులు బాగుపడేవారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. పరిటాల సునీత రాష్ట్ర వ్యాప్తంగా వేరుశనగ నూనెను రేషన్‌ సరుకుల్లో అమ్మి ఉంటే వేరుశనగ ధర రూ. 3 వేలు ఉండేదన్నారు. తమ చేతుల్లో ఉన్న పనిని కూడా చేయడం లేదనన్నారు. అదే విధంగా పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇవ్వమంటే ఎగువనున్న తుర్గాలపట్నం చెరువుకు నీరు ఇచ్చారన్నారు. పేరూరు ప్రాజెక్టు పేరుతో మరో కొత్త దోపిడీకి తెరతీసేందుకు ముక్యమంత్రి కుట్ర చేస్తున్నాడన్నారు. రూ.803 కోట్ల అంచెనాలతో కొత్త టెండర్లు పిలుచుకొని అందులో రూ. 4 వందల కోట్ల దోపిడీ చేయాలని, ఆ డబ్బుతో ప్రజల ఓట్లు కొనాలని పథకం వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 

తాజా ఫోటోలు

Back to Top