చంద్రబాబు పచ్చిమోసగాడు, దగాకోరు

మోసం, వంచన, దగా పెట్టుబడిగా రాజకీయాలు చేసే నీచుడు
పోరాటం, నిజాయితీ, ధైర్యం వైయస్‌ జగన్‌ పెట్టుబడులు
బాబు 40 ఏళ్ల చరిత్ర అంతా దుర్మార్గాలు, దుర్నీతి
తండ్రి ఆశయ సాధన కోసం తపిస్తున్న జననేత
ఒకవైపు రాష్ట్రం కోసం.. ప్రజల కోసం మరోవైపు పోరాటం
పోరాటాల పార్టీని ఆశీర్వదించండి
వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

అనంతపురం: సీఎం చంద్రబాబు పచ్చి మోసగాడు, దగాకోరు అని, ఏ ఒక్కరోజు చంద్రబాబు ప్రజల కోసం పోరాడిన దాఖళాలు లేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించే ధీశాలి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని, 2014లో చేసిన పొరబాటును మళ్లీ చేయబోమని ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీవైపు వస్తున్నారన్నారు. అనంతపురంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం అని చెప్పుకుని తిరిగే చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా అత్యంత దుర్మార్గాలు, దుర్నీతి, అక్రమాలకు నెలవన్నారు. వంచన, మోసం, దగా అనేవే పెట్టుబడిగా రాజకీయాలు చేసే నీచుడిపై నిజాయితీ, ధైర్యం, పోరాటం, ఆవేశం పెట్టుబడిగా వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటం స్వచ్ఛమైనదన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ పాలన అందించారని భూమన గుర్తు చేశారు. తన తండ్రి ప్రజల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు ముందుకు వస్తానని వైయస్‌ జగన్‌ ప్రతి సందర్భంలో చెబుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ 15 వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే వైయస్‌ జగన్‌ మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తూ.. వారి కన్నీళ్లు తూడుస్తున్నారన్నారు. ఎవరైతే హోదా ఇస్తారో వారికి వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు ఇస్తామని, మోసగాళ్లకు, గజదొంగలకు ఇవ్వమని ప్రకటించారన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలు, మరోవైపు ప్రజల భవిష్యత్తు కోసం వీరోచిత పోరాటం చేస్తున్నారన్నారు. 

ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న వారిపై కేసులు పెట్టించిన జైళ్లకు పంపించిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని భూమన మండిపడ్డారు. మొదటి నుంచి హోదా కోసం వైయస్‌ జగన్‌ నిరంతరం పోరాటం చేస్తున్నారు కాబట్టే ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీవైపు వస్తున్నారన్నారు. ఇది గమనించిన చంద్రబాబు వైయస్‌ జగన్‌వైపు ప్రజలంతా మళ్లారని యూటర్న్‌ తీసుకొని హోదా అంటూ కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం నిజమైన పోరాటాలు చేస్తున్న వైయస్‌ జగన్‌ను ఆదరిద్దామని, ఉద్యమ పార్టీని గెలిపద్దామని ప్రజలకు సూచించారు. వైయస్‌ఆర్‌ ఆశయాలే సిద్ధాంతాలుగా మలుచుకున్న వైయస్‌ఆర్‌ సీపీని ఆశీర్వదించాలన్నారు.  

తాజా వీడియోలు

Back to Top