నైతిక‌త లేని చంద్రబాబు

పులివెందుల‌) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుకి ఎటువంటి నైతిక విలువ‌లు లేవ‌ని వైఎస్సార్సీపీ క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. అవినీతి చేసి సంపాదించిన కోట్ల రూపాయిలు వెద‌జ‌ల్లి.. ఎమ్మెల్యేల‌ను కొనుగోలుచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పులివెందుల లోని వైఎస్ జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నైతిక‌త ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల‌కు వెళితే గెలవ‌లేమ‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు  ఆప‌ని చేయ‌టం లేద‌ని అవినాష్ రెడ్డి అన్నారు. 
Back to Top