బీసీలను అణగదొక్కే దుర్బద్ధి చంద్రబాబుది

విజయవాడ: కులవృత్తులు చేసుకునేవారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదనే దుర్బద్ధి ఉన్న వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయిస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. అదే విధంగా కార్పొరేషన్, నామినేటెడ్‌ పదవులు ఇస్తానన్న హామీ ఎటుపోయిందని నిలదీశారు. బీసీలను ఉద్దరించాలి, సమాజంలో తగిన గౌరవం కల్పించాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే బీసీలు అభివృద్ధి చెందుతారన్నారు. 
Back to Top