బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలే

* మూడేళ్లు అయినా నాకు ఇల్లు రాలేదు
* క‌లెక్ట‌ర్ చెప్పినా స్పంద‌న లేదు
* బాధితుడు రాజేంద్ర ప్ర‌సాద్‌
క‌ర్నూలు: చ‌ంద్ర‌బాబు నాయుడు చెప్పే మాట‌ల‌న్నీ కూడా అబ‌ద్ధాలేన‌ని విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక మండ‌లం రెడ్డి తుగ్లం గ్రామానికి చెందిన శనగల రాజేంద్రప్రసాద్‌ అన్నారు. త‌న‌కు మూడేళ్ల క్రితం ఇల్లు ఇస్తున్న‌ట్లు అర్హ‌త ప‌త్రాన్ని అందించి ఇప్ప‌టి వ‌ర‌కు ఇల్లు ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. నంద్యాల శిల్పా మోహన్‌రెడ్డి స్వగృహంలో బాధితుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ చంద్ర‌బాబు త‌న‌కు   గృహాన్ని మంజూరు చేస్తూ ఆయన సంతకంతో అర్హత పత్రాన్ని అందించి మూడేళ్లు పూర్తి కావస్తున్నా ఇళ్లు మంజూరైనట్లు స్థానిక అధికారులు ధ్రువీక‌రించ‌లేద‌ని, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ స‌మ‌క్షంలో  ప్రజా దర్బార్‌లోమొర‌పెట్టుకున్నా ఫ‌లితం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం  చేశారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకే నంద్యాల‌కు వ‌చ్చాన‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. 
Back to Top