బాబు ప్రజలను వంచించారు

వైయస్‌ఆర్‌ సీపీ నేత ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి
గోనెగండ్ల: ఓట్ల కోసంఎన్నికల ముందు మహిళలకు, రైతులకు నిరుద్యోగులకు ఉత్తుత్తి హమీలిచ్చిన చంద్రబాబు ఎన్నికల అనంతరం వాటిని విస్మరించి ఓటర్లను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జీ ఎరక్రోట జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని పెద్దమరివీడు గ్రామంలో రెండవ రోజు ఎస్సీ కాలనీ తదితరప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం  మోసం చేసి గద్దె నెక్కిన విధానాలను ప్రజలకు తెలియ జేస్తూ కరపత్రాలిస్తూ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంటికో జాబు ఇస్తాడనుకొని నిరుద్యోగులు భావిస్తే వున్న జాబులను ఊడగొట్టాడని దీంతో ఉద్యోగాలు పోగొట్టుకొని వీధినపడ్డారన్నారు. మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, రైతులకు వ్యవసాయ రుణమాఫీ అంటూ మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇచ్చిన హమీలను నెరవేర్చలేదన్నారు. దీంతో వారంతా వడ్డీలు కట్టుకుంటూ అప్పుల పాలవుతున్నారని అన్నారు. కాగా పించన్లు,మంచినీరు , రోడ్లు తదితర సమస్యలపై స్థానికులు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో చంద్రబాబుకు గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం చేతులో మోసపోయిన బాధితులకు వైయస్‌ఆర్‌ సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పార్టీ సింగిల్‌ విండో అధ్యక్షులు కాశిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు సయ్యద్‌ చాంద్, వెంకటరెడ్డి, దస్తగిరి, ప్రభుదాస్, నర్సన్న, గోపాల్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. 
Back to Top