బాబు అనకొండ, లోకేష్ కొండచిలువ

() చంద్రబాబుది ప్రజా కంటక పాలన

() బాబు సంతకాలు పెడుతుంటే లోకేష్ సూట్కేసులు సర్దుతున్నారు

() రెండేళ్ల పాలన మీద మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్) అనుభవశీలి ని అని చెప్పుకొనే చంద్రబాబు గొప్పతనం
అంతా అవినీతిలోనే కనిపిస్తోందని వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి
ఎమ్మెల్యే రోజా అభిప్రాయ పడ్డారు. అవినీతిలో చంద్రబాబు అనకొండ అయితే, ఆయన కుమారుడు
లోకేష్ బాబు కొండచిలువ అని ఆమె అభివర్ణించారు. రెండేళ్ల పాలనలో మహిళలపై వేధింపులు
పెరిగాయి తప్పితే, ఏ విధమైన మేలు జరగలేదని విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితుల్లో
మహిళల దగ్గరకు వెళితే పేడ నీళ్లు పడటం ఖాయమని రోజా జోస్యం చెప్పారు. హైదరాబాద్
లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. రోజా
ఏమన్నారో ఆమె మాటల్లోనే చూద్దాం.

ఇది ప్రజా కంటక పాలన    

    చంద్రబాబు
పరిపాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజా కంటక పాలన. రెండు మాటల్లో చెప్పాలంటే
సంక్షోభం, దుర్భిక్షం.అదే మూడు మాటల్లో చెప్పాలంటే అవినీతి, అరాచకం, అసమర్థత
కనిపిస్తాయి. చంద్రబాబు, లోకేష్ ల అవినీతి మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలు పంపించే
రాకెట్ల కన్నా ఎక్కువ వేగంతో దూసుకెళుతోంది. తండ్రీ కొడుకులు బరి తెగించి మరీ
అవినీతి కి పాల్పడుతున్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని ఏఖంగా దోచుకొనే పద్దతి
అనుసరిస్తున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి
కొడుకు కూర్చోవటాన్ని ఎక్కడైనా చూశాం. ఇక్కడ మాత్రం చంద్రబాబుతో కలిసి లోకేష్ బాబు
మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు సంతకాలు పెడుతుంటే లోకేష్ బాబు
సూట్ కేసులు సర్దుతున్నారు. తెలుగు సినిమాల్లో కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు,
కానీ, ఇక్కడ రాజకీయాల్లో లోకేష్ బాబుని కలెక్షన్ కింగ్ అని పేరు వచ్చింది. రాష్ట్ర
వ్యాప్తంగా ఉన్న భూముల్ని కబ్జాలు చేసి, అక్రమాలకు పాల్పడుతున్నారు.

        చంద్రబాబుని
అవినీతిలో అనకొండ అనుకొంటే, లోకేష్ లో కమీషన్ల లో కొండచిలువ అనవచ్చు. అనుభవజ్నుడు
అని చెప్పుకొనే చంద్రబాబుకి అవినీతిలోనే అనుభవం ఉంది. ఆయన అనుభవం ఎవరికీ లేదనే
చెప్పుకోవాలి.

        ఈ రెండేళ్ల
పాలనలో మహిళలకు ఏం చేశారు అంటే ఏమీ లేదు. మ్యానిఫెస్టో లోని 16, 17 పేజీల్లో చాలా
రాశారు. ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతున్నాను. డ్వాక్రా మహిళల్ని వెన్నుముకతో
సహా విరిచేసి కూర్చోబెట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన సమయంలో మహిళలు
లక్షాధికారులుగా మారారు. స్వయం ఉపాధి పథకాలతో ఆర్థిక స్వావలంబన సాధించారు. ఇప్పుడు
మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసగించటంతో బ్లాక్ లిస్టులోకి ఎక్కి ఇంటికి,
బ్యాంకులకు మధ్య నలిగిపోతున్నారు. మీరు విందులు, వినోదాలకు పెట్టే ఖర్చు లో కొంత
మొత్తాన్ని కేటాయించినా అక్క చెల్లెమ్మలకు ఊరట కలిగి ఉండేది. ఇంతటి మోసాలకు
పాల్పడుతున్న తెలుగుదేశం నాయకులు మహిళల దగ్గరకు వెళితే పేడనీళ్లు చల్లి
సన్మానిస్తారు.

మహిళల రక్షణకు చర్యలేవీ       

మహిళల రక్షణకు
ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో అడిషనల్
ఐజీ స్థాయి అధికారిని, జిల్లా లో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని, మండల స్థాయిలో
సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామని గొప్పలు చెప్పారు. మరి
ఎక్కడా కనిపించటం లేదే. ర్యాగింగ్, వేధింపులకు వ్యతిరేకంగా చట్టాలు కఠినంగా అమలు
చేస్తామని చెప్పారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే తోడేళ్ల మాదిరిగా ఆడవాళ్ల మీద పడుతుంటే మీరు
వెనుక ఉండి సెటిల్ మెంట్లు చేయిస్తున్నారు. బయటకు వెళ్లిన మహిళలు తిరిగి
సురక్షితంగా ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు. తెలుగుదేశం నేతలు అండగా ఉంటున్నారు
కాబట్టే నేరగాళ్లు చెలరేగుతున్నారు.

        రెండేళ్ల లో
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మహిళలకు ఏమేం చేశాడు అన్నది  చూస్తే మనకు విషయం అర్థం అవుతుంది. రిషితేశ్వరి
అనే తెలివైన విద్యార్థి ఈ టీడీపీ అనుచరుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొంది.
అక్రమ ఇసుక తవ్వకాల్ని అడ్డుకొనేందుకు ఒక సిన్సియర్ రెవిన్యూ అధికారి ప్రయత్నిస్తే
ఆమె మీద పట్ట పగలు దాడి జరిగింది. దీని మీద ఆమె పోలీసు కేసు పెడితే పట్టించుకొనే దిక్కులేదు.
పైగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని సెటిల్ మెంట్ చేయించటం,
మంత్రివర్గ భేటీలో ఆమె దే తప్పని తీర్మానించటం జరిగింది. కాల్ మనీ సెక్సు రాకెట్
కుంభకోణంలో టీడీపీ నాయకులే దోషులుగా తేలారు. బోడే ప్రసాద్, బుడ్డా వెంకన్న
తదితరుల్ని మీరే వెనకేసుకొని వచ్చి, రక్షించినతీరు అందరికీ తెలుసు. మహిళలంటే ఎంత
చులకన అన్నది అందరికీ తెలుసు.

        అంతెందుకు,
మొన్ననే విశాఖపట్నంలో లావణ్య అనే అమ్మాయిని తరిమి, తరిమి వాహనంతో గుద్దించి
చంపేశారు. దీనికి పది లక్షల రూపాయిల వెల కట్టి సెటిల్మెంట్ చేయించారు. మహిళ జీవితం
అంటే అంతటి చులకనగా ఉంది. ఎన్నికల సమయంలో చాలానే చెప్పారు. తప్పు చేసినవాళ్ల తాట
తీస్తా అనేవారు. ఇప్పుడు తప్పులు చేస్తున్న బాబు తాట తీయాల్సిన అవసరం ఏర్పడింది.
ఆడపిల్ల పుడితే రూ. 25వేల రూపాయిల డిపాజిట్ చేస్తామని గొప్పలు చెప్పారు. మరి ఒక్క
రూపాయి కూడా డిపాజిట్ చేయలేదంటే దానర్థం ఈ రెండేళ్లలో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు
అనుకోవాలా. హైస్కూల్ చదువుకొనే ఆడపిల్లలకు సైకిళ్లు కొని ఇస్తామని గొప్పలు
చెప్పారు. ఒక్క బాలిక కు అయినా సైకిల్ ఇచ్చారా అని నిలదీస్తున్నాం. ఇన్ని రకాలుగా
మహిళలకు అన్యాయం చేస్తున్నందున కచ్చితంగా ఈ పాపాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.

మద్యం మీద అంత మోజా బాబూ  

      మద్యం
విక్రయాలకు సంబంధించి బెల్టు షాపుల్ని తగ్గిస్తాం అని గొప్పలు చెప్పారు. తగ్గించటం
మాట దేవుడెరుగు అన్నీ పెంచుకొంటూ వెళుతున్నారు. మద్యం అమ్మకాల కోసం ఎంతైనా
తెగిస్తున్నారు. మొదటి ఏడాది 20శాతం మేర అమ్మకాలు పెరిగితే, రెండో ఏడాది 30శాతం
మేర అమ్మకాలు పెంచుకొని మురిసిపోతున్నారు. మీ విధానాల కారణంగా దిగువ, మధ్యతరగతి
కుటుంబాలు ఏ విధంగా చితికిపోతున్నాయో మీకు తెలుసా. ఎంత సేపు చూసినా ఆదాయం ఇంకా
పెరగాలి, ఇంకా పెరగాలి అనే చూసుకొంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకొంటే మద్యం
అమ్మకాలు తగ్గిపోతున్నాయి అని గుండెలు బాదుకొంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని
ఇక్కడే చూస్తున్నాం.

        మద్యం తాగండి,
పేకాట ఆడండి ఉల్లాసంగా ఉంటారు. అని చెప్పటం అంటే ఏమనుకోవాలి. అసలు మీకు మతి ఉందా,
లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఇటువంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్ లో చేర్చాల్సిన
అవసరం ఉంది. అటువంటప్పుడు చంద్రన్న పేకాట, చంద్రన్న పెగ్గులు, చంద్రన్న డప్పులు
అనే పథకాలు మొదలు పెడతారా. వాటికి కూడా జన్మభూమి కమిటీలతో అనుసంధానం చేస్తారా అన్న
అనుమానాలు కలుగుతాయి. ఏ ఒక్కరికీ న్యాయం చేయని వ్యక్తే ఈ చంద్రబాబు.

        చంద్రబాబు
చేసే పనులు అన్నీ ఇలాగే ఉంటాయి. విద్యార్థుల దగ్గరకు వెళ్లి 10రూపాయిలు ఇమ్మని
అడుగుతారు. ఉద్యోగులు నెల జీతం ఇవ్వాలి అంటున్నారు. పదే పదే విభజన కారణం చూపించి
ఉద్వేగాలు రెచ్చగొడతారు. అసలు విభజన కు కారకులు చంద్రబాబే అన్నది అందరికీ తెలుసు.
కాంగ్రెస్ పార్టీతో కలిసి మొదట మేం లేఖ ఇచ్చాం, మొదట మేం ఓటు వేశాం అని పోటీ పడి
మరీ విడగొట్టారు. మరి అప్పుడు ఏమీ అనిపించలేదా, పోనీ తర్వాత అయినా మీకు మంచి
అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అక్కడ కేంద్ర
ప్రభుత్వంలో మీ మిత్ర పక్షం ఉంది. అటువంటప్పుడు అప్పటి విభజన చట్టంలో ఏమైనా లోపాలు
ఉంటే సరిదిద్దుకొనేందుకు అవకాశం ఉండనే ఉంది.

అభివ్రద్ధి తక్కువ, అవినీతి ఎక్కువ

        ఎంతసేపూ మీ
ద్రష్టి అంతా మీ అత్తగారి ప్రాంతం అయిన క్రిష్ణా జిల్లా మీదనే ఉంది. ఆ ప్రాంతాన్నే
అన్ని రకాలుగా అభివ్రద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పితే ఇతర ప్రాంతాల
గురించి పట్టించుకోవటం లేదు. మీకు ఓట్లేయలేదు కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని ఏమాత్రం
పట్టించుకోవటం లేదు. గతంలో హైదరాబాద్ బాగా అభివ్రద్ధి చెందాక కట్టుబట్టలతో బయటకు
వచ్చినట్లుగానే మరోసారి పునరావ్రత్తం అయ్యే అవకాశం ఉంది.

        ఈ రెండేళ్ల
కాలంలో ఏం జరిగింది అన్నది చూసుకొంటే తండ్రీ కొడుకులు దోచుకోవటం తప్ప సాధించిందేమీ
కనిపించటం లేదు. రెండు నుంచి 8 దాకా సంబరాలు దేనికో అర్థం కావటం లేదు. ఆర్థిక
వనరులు ఉండి, ప్రగతి సాధిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజుతో సంబరాలు చేసుకొని
సరిపెట్టుకొంటే మీకు వారం రోజుల పాటు సంబరాలు చేసుకొంటున్నారా. మందు తాగండి, పేకాట
ఆడండి అనే తలతిక్క మాటలు మానుకోలేరా. లేదంటే మాత్రం మహిళల దగ్గర చీపురు దెబ్బలు
తప్పవు. ఎంత మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా ఆయా  విద్యా సంస్థల అధిపతి నారాయణ మీద కేసులు ఉండవు.
వనజాక్షి వంటి ఆఫీసర్ మీద దాడిచేస్తే చింతమనేని మీద చర్యలు ఉండవు. ఇటువంటి అన్యాయాలు
చేస్తున్న మీకు, బాధితుల ఉసురు కచ్చితంగా తగులుతుంది చంద్రబాబూ..!

 అని ఎమ్మెల్యే రోజా
పేర్కొన్నారు.

 

 

 

 

 

 

 

Back to Top