బాబు అన్ని మతాలను సమానంగా చూడడం లేదు

గుంటూరు: మైనారిటీ ప్రాతినిథ్యం లేని ఏకైక కేబినెట్ ఏపీదేనని వైయస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆక్షేపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని మతాలను సమానంగా చూడడం లేదని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఎల్లుండి(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రాక్షసపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

Back to Top