టీడీపీలో చేరలేదని దాడి

విశాఖపట్నం: పాల్మాన్పేటలో వైయస్సార్సీపీ కార్యకర్తలు, మత్స్యకారులపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేయడాన్ని వైయస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈఘటనపై 

వైయస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటి సభ్యులు పాల్మాన్ పేటలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీలో  చేరడం లేదన్న కారణంతోనే తెలుగుదేశం పార్టీ నేతలు తమపై దాడి చేశారని వైయస్సార్సీపీ నేతలు తెలిపారు. బొత్స సత్యనారాయణ, మోపీదేవి వెంకటరమణ, కన్నబాబు, దాడిశెట్టి రాజా, కోలా గురువులు తదితరులు పాల్మాన్ పేట బాధితులను కలుసుకొని  వాస్తవాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా అధికారమదంతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్న పచ్చనేతలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top