దిగ్విజ‌యంగా కొనసాగుతున్న ఆత్మగౌరవయాత్ర

  • వైయ‌స్ఆర్‌సీపీ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు వెల్లువ‌
  • గుడివాడ అమ‌ర్‌నాథ్ పాద‌యాత్ర‌కు అపూర్వ స్పంద‌న‌
  • మిన్నంటుతున్న విశాఖ రైల్వేజోన్ డిమాండ్‌
విశాఖ‌ప‌ట్నం:  విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వే జోన్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ఉద్య‌మానికి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. ఆత్మగౌర‌వ యాత్ర పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ మార్చి 30 నుంచి చేప‌ట్టిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది.  ఈ యాత్ర‌కు లభిస్తున్న జనస్పందననే జోష్‌గా మార్చుకొని.. ద్విగుణీకృతోత్సాహంతో గుడివాడ అమ‌ర్‌నాథ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మంగ‌ళ‌వారం నాటికి ఆత్మ‌గౌర‌వ యాత్ర ఆర‌వ రోజుకు చేరింది. అమర్‌కు వెన్నుదన్నుగా.. సంఘీభావంగా పార్టీ నాయకులు, శ్రేణులు నిలుస్తున్నారు.. ఆయన అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతుంటే ఆత్మగౌరవయాత్ర సాగిన మార్గం పొడవునా మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు జయజయధ్వనాలతో రైల్వేజోన్‌ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. మద్దతు ప్రకటిస్తున్నారు. అన‌కాప‌ల్లి నుంచి ప్రారంభ‌మైన యాత్ర‌ నిర్విఘ్నంగా సాగుతోంది. అడుగడుగునా అమర్‌కు జనం హారతులు పడుతున్నారు. ఐదో రోజైన సోమవారం ఉదయం గవర జగ్గయ్యపాలెంలో ప్రారంభమైన యాత్ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఉత్తరాంధ్ర జిల్లాల క‌న్వీన‌ర్‌, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు పలువురు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి అమర్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్నారు. 
Back to Top