హైదరాబాద్) ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతూ అధికార పక్షం ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ అర్థాంతరంగా సోమవారానికి వాయిదా పడింది. మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే అన్యాయంగా, నిబంధనలకు విరుద్ధంగా మహిళా ఎమ్మెల్యే రోజా ను ఏడాదిపాటు సస్పెండ్ చేయటంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆయన ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలిన అధికార పక్షం ..మేమింతే అన్న ధోరణిని ప్రదర్శించారు. దీంతో ప్రజాస్వామ్య రీతిలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు తమ ఆవేదన ను వినిపిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా సభను వాయిదా వేశారు.