తిరుపతి సదస్సుకు పూర్తయిన ఏర్పాట్లు

తిరుపతి, 13 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, సీజీసీ సభ్యుడు భూమా నాగిరెడ్డి తెలిపారు. తిరుపతిలో శుక్రవారంనాడు ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు ఆరు జిల్లాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని వారు వివరించారు. సదస్సు జరగనున్న ప్రాంగణాన్ని గురువారం ఉదయం సందర్శించి కరుణాకరరెడ్డి, నాగిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ.. సహకార ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, ‌టిడిపిలు కుట్రలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు చాలా చోట్ల కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. శుక్రవారం జరగనున్న సదస్సులో ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే దానిపై చర్చిస్తామన్నారు.

పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు ‌దిశా నిర్దేశం చేయనున్నారని ‌కరుణాకరరెడ్డి, నాగిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్, ‌టిడిపిలు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొనేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు.

Back to Top