ప్రతిపక్షం లేకుండా శాసనసభా...సిగ్గు సిగ్గు

హైదరాబాద్: శాసనసభలో ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిపక్షంపై అధికారపక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్బండ్పైన అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రజా సమస్యలను గట్టిగా నిలదీస్తున్నందుకే తనపై టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారన్నారు.  'సభలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే కరెక్ట్...మేము మాత్రం ఆడవాళ్లమంటా...చీర కప్పుకొని వెళ్లాలంటా. వాళ్లనేమీ అనుకూడదట. ఇదేమీ న్యాయం' అని రోజా ప్రశ్నించారు. బోండా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు.
Back to Top