పరిటాల సునీత మెప్పుకోసమే పోలీసులు ఆరాట౦

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. తమ పార్టీ నేత ప్రసాదరెడ్డి హత్య కేసును పక్కన పెట్టి.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పరిటాల సునీతను సంతృప్తి పరిచేందుకే పోలీసులు ఆరాట పడుతున్నారన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీ నేతలను వేధిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top