అణచివేయాలని చూస్తే మరింత బలపడుతారు

భువనగిరి (నల్గొండ జిల్లా):

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అణచివేయాలని ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆయన మరింత బలంగా ఎదుగుతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజవేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజూ జొక్యం చేసుకోలేదన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనను విమర్శించడం నీతిమాలిన చర్యగా పురుషోత్తంరెడ్డి అభివర్ణించారు.

భువనగిరి పట్టణంలోని పలు కాలనీలకు చెందిన మహిళలు, యువకులు పురుషోత్తంరెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక రహదారి బంగ్లాలో ప్రజలనుద్దేశించి పురుషోత్తంరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభంజనం కొనసాగుతోందని అన్నారు. అన్ని వర్గాల వారు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొడుతున్నారని, రానున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి చెప్పారు.

Back to Top