అంబేద్క‌ర్ జ‌యంతిని విజ‌య‌వంతం చేద్దాం

పి. గ‌న్న‌వ‌రంః విజయవాడ గాంధీనగర్‌ కందుకూరి కల్యాణ మండ‌పంలో గురువారం జ‌రిగే రాజ్యాంగ ప్ర‌దాత డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వానికి నియోజకవర్గ పరిధిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా త‌ర‌లిరావాల‌ని పార్టీ కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు బుధవారం పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అధ్యక్షతన ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top