'పులిచింతల' ప్రారంభించే హక్కు వైయస్ జగ‌న్‌దే

పులిచింతల (గుంటూరు జిల్లా),

4 డిసెంబర్ 2013: పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించే హక్కు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బ్రిజే‌ష్ కుమా‌ర్ ట్రి‌బ్యునల్ తీర్పు‌ను నిరసిస్తూ గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు దగ్గర పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైమస్‌ విజయమ్మ బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పులిచింతల ప్రాజెక్టుకు పునాది పడిందని గుర్తుచేశారు. ప్రాజక్టులను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబుకు ధర్నాలు చేసే నైతిక హక్కు లేదని అంబటి ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top