ఏబీఎన్....ఆల్ బోగస్ న్యూస్

  • చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారు
  • బాబూ నాలుగేళ్ల పాలనంతా శూన్యం..అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారు
  •  మంత్రి యనమల నీచమైన వ్యక్తి
  • దిగజారుడు రాజకీయాలు చేయడంలో ఆయన సీనియర్ మోస్ట్
  • దేశంలో ఏం జరిగినా వైయస్ జగన్ పై బురదజల్లడం టీడీపీకి అలవాటైపోయింది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 
గుంటూరుః  అభివృద్ధి పేరుతో  చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రాన్ని దోచుకుతింటుంటే, మంత్రి యనమల రామకృష్ణుడు వారికి వంత పాడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  ఏబీన్ న్యూస్ ఛానల్ ఆల్ బోగస్ న్యూస్ ఛానల్ గా తయారైందని అంబటి నిప్పులు చెరిగారు. నిత్యం టీడీపీకి అనుకూలంగా..వైయస్సార్సీపీ, వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఏబీఎన్ కథనాలు వండి వార్చుతుందని అంబటి ఫైర్ అయ్యారు.  అమరావతికి వరల్డ్ బ్యాంకు ఇచ్చే రుణాన్ని రానివ్వకుండా వైయస్సార్సీపీ తప్పుడు ఈమెయిల్స్ పంపుతోందంటూ  మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడడంపై ...అంబటి రాంబాబు గుంటూరులో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో ఈమెయిల్స్ పంపాల్సిన అవసరం తమకు లేదని, మీరు చేస్తున్న తప్పులను ధైర్యంగా ఎత్తిచూపే సత్తా వైయస్సార్సీపీకి ఉందని అంబటి రాంబాబు యనమలకు హితవు పలికారు.  రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని  వైయస్ జగన్ కు ఆపాదిస్తూ బురదజల్లడం టీడీపీకి అలవాటైపోయిందని అంబటి మండిపడ్డారు. ఎవరో పిటిషన్ వేసిన దానికి.... వైయస్సార్సీపీకి ఏ సంబంధం లేకపోయినా గుడ్డ కాల్చి ముఖాన వేయడం దారుణమని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తారు.  

గతంలో చంద్రబాబు బృందం అమెరికాలో పర్యటించినప్పుడు కూడ ఇలాగే  ప్రవర్తించారని, వైయస్ జగనే ఈమెయిల్ పంపాడంటూ బురజల్లారని అంబటి గుర్తు చేశారు.  కాపు ఉద్యమ  ఘటన సమయంలో రైలు దగ్ధమైతే, కడపవాళ్లే వచ్చి అగిపుల్లవేశారని కట్టుకథలు అల్లుతూ చంద్రబాబు వైయస్ జగన్ పై నిందలు వేశాడని అంబటి ఈ సందర్భంగా తెలియజేశారు.  రాజధానిలో అరటిచెట్లు తగలబడిన సందర్భంలోనూ కడపవాసులు తగలబెట్టారని మాట్లాడారని...ఎక్కడ ఏం జరిగినా దాన్ని వైయస్సార్సీపీ, వైయస్ జగన్ పైకి నెట్టేయడం బాబుకు అలవాటుగా మారిందని అంబటి దుయ్యబట్టారు. మీరు అధికారంలోనే ఉన్నారు, ఏ ఒక్కదాన్నైనా నిరూపించారా బాబూ అని నిలదీశారు.  అమరావతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని, అభివృద్ధికి ఎప్పుడూ తాము అడ్డుకాదని మరోసారి స్పష్టం చేశారు. చైనా, అమెరికా, సింగపూర్ ను తలదన్నే రీతిలో అమరావతిని నిర్మిస్తానంటూ చంద్రబాబు కలల ప్రపంచాన్ని సృష్టించాడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తుందని, భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కానరావడం లేదని చురక అంటించారు.  రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరగక్కపోగా...తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ లు నిర్మించి వందలు, వేల కోట్లు దోచుకున్నారని విరుచుకుపడ్డారు.  అభివృద్ధి పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు మింగేస్తున్నందునే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన తాము ప్రశ్నిస్తున్నామన్నారు.  

బాబు అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఏమీ చేయలేదు కాబట్టే చంద్రబాబు కుట్రపూరిత  ప్రకటనలిస్తునన్నాడని అంబటి విమర్శించారు. వైయస్ జగన్ పై నిందలు వేసి తప్పించుకోవాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు.  దొంగచాటుగా పిటిషన్ లు  వేసే  దౌర్భాగ్య పరిస్థితుల్లో వైయస్సార్సీపీ లేదన్నారు. ఎవరో చేసిన దానికి వైయస్సార్సీపీపై రుద్దడం సరికాదన్నారు. యనమల రామకృష్ణుడు దిగజారుడు రాజకీయాలు చేయడంలో సీనియర్ మోస్ అని అంబటి ఎద్దేవా చేశారు. 2018లో రాజ్యసభ టికెట్ కోసం బాబు కటాక్షం పొందేందుకే యనమల వైయస్సార్సీపీ, వైయస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను  సభలో మాట్లాడనీయకుండా బయటకు గెంటేసిన నీచమైన వ్యక్తి యనమల అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బాబు బహుమతిగా ఆర్థికమంత్రిని చేసి పక్కనకూర్చోబెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి నీతిమాలిన, దిక్కుమాలిన పని చేస్తూ వైయస్సార్సీపీ, జగన్ ను నిందించడం మానుకోవాలన్నారు. దేశంలో ఏం జరిగినా జగనే కారణమనే దౌర్భాగ్యానికి చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని అంబటి పైర్ అయ్యారు. రాజధాని నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేయండి తప్ప..దానిపేరుతో అక్రమంగా వేలకోట్లు దాచుకునే కార్యక్రమం చేయొద్దని హితవు పలికారు. 

నంద్యాల ఉపఎన్నికలో  వైయస్సార్సీపీ విజయం సాధిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానన్న అఖిలప్రియ వ్యాఖ్యలపై స్పందించిన అంబటి...అఖిలప్రియ తప్పుకుంటారో, బాబు తప్పుకుంటారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ధర్మం, అవినీతి పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అంబటి అన్నారు. బాబు డబ్బుల సంచులు వదిలి గెలవాలని చూస్తున్నాడని అంబటి ఆరోపించారు. నా పింఛన్, నా రేషన్, నేను వేసిన రోడ్ల మీద నడవొద్దంటూ చంద్రబాబు ప్రజలను బెదిరించడం సిగ్గుచేటన్నారు. బాబుకు మతిస్థిమితం తప్పిందిని ఎద్దేవా చేశారు.   ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత జరిగే ఈ ఎన్నిక బాబు పాలనకు రెఫరెండం కాబోతుందని అంబటి చెప్పారు. విశాఖ భూముల కబ్జాపై సీబీఐ ఎంక్వైరీ వేయమంటే...బాబు, లోకేష్ లు పారిపోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆధారాలు చూపించేందుకు వైయస్సార్సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

Back to Top