టీడీపీవి చౌకబారు రాజకీయాలు

కేసుల భయంతో కేసీఆర్ తో బాబు లాలూచీ 
మంత్రులు అవాకులు, చెవాకులు మానుకోవాలి
ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రాజెక్ట్ లను అడ్డుకోవాలి
లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు
హరీష్ రావు రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదుః అంబటి

కర్నూలుః తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న జననేతపై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంత్రులను హెచ్చరించారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమ, నారాయణ, గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై అంబటి తీవ్రస్థాయిలో స్పందించారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న వైయస్ జగన్ దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిపోయి...టీడీపీ మంత్రులు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లపై చంద్రబాబు, మంత్రులు ముందుగా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో చంద్రబాబు కేసీఆర్ తో లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్  దీక్షను అణచాలని చూసినా, పోరాటాన్ని నీరుగార్చాలని చూసిన ప్రభుత్వానికే ప్రమాదమన్నారు. 

అనుమతులు లేకుండా  ప్రాజెక్ట్ లు కట్టడమే గాక...మంత్రి హరీష్ రావు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తెలగాణ ప్రభుత్వం అక్రమంగా తీసుకెళ్తుంది వాస్తవం కాదా...? అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను తీసుకెళ్తుంటే  చూస్తూ ఊరుకోవడానికి ప్రతిపక్ష వైయస్సార్సీపీ సిద్ధంగా లేదని తేల్చిచెప్పారు.

టీడీపీ మంత్రులు ఓ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని అంబటి ఫైరయ్యారు. మహానేత వైయస్  రాజశేఖర్ రెడ్డి మీద, వైయస్ జగన్  మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.  తమ మీద రాళ్లు వేయడం కాదని, మీకు చిత్తశుద్ధి ఉంటే  తెలంగాణ దోచుకుపోతున్న జలాలను నివారించాలని మంత్రులకు సవాల్ చేశారు.   రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అధికార టీడీపీని హెచ్చరించారు. 

To read this article in English:  http://bit.ly/1rQMb9u 

తాజా ఫోటోలు

Back to Top