చంద్రబాబు దుర్నితికి ఓటుతో బుద్ధిచెప్పాలి...

గుంటూరుః రాష్ట్ర్రానికి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా అని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన నాయకత్వంలోనే పేదవాడు గొప్పవాడు, రైతు రాజు అవుతారన్నారు. చంద్రబాబు పాలనలో దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రజలు చూస్తున్నారన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ధనార్జన కోసం వాడుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా సంజీవని కాదన్న చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని ప్రత్యేకహోదా అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు దుర్నితిని ఎండగడుతూ నడుస్తున్న జగనన్నకు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top