ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుదాం

ప‌శ్చిమ‌ గోదావ‌రి: .అధికార తెలుగు దేశం పార్టీ నేత‌లు అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుదామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు.  మూడేళ్ల టీడీపీ పాల‌న‌లో జిల్లాలో పెరిగిన అవినీతి, ప్రజలపై దాడులు, చివరకు పోలీసులపై దాడులకు తెగబడుతున్న వైనాలను ఎండగట్టడంతోపాటు జిల్లా సమస్యలపై చర్చించేందుకు ప్లీనరీని వేదికగా చేసుకోవాలని నిర్ణయించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీని ఈనెల 19న ఏలూరులో నిర్వహిస్తున్నట్టు  ఆళ్ల నాని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, చర్చించాల్సిన‌ అంశాలపై పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో   ఆయన సమీక్ష నిర్వహించారు. ఏయే తీర్మానాలు ప్రవేశపెట్టాలి, విధి విధానాలు ఏమిటనే అంశాలపై మాట్లాడారు. ఇప్పటివరకూ జిల్లాలోని నియోజకవర్గాల్లో జరిగిన ప్లీనరీల తీరు, మిగిలిన నియోజకవర్గాల్లో నిర్వహించా ల్సిన ప్లీనరీలపై చర్చించారు. నియోజకవర్గ ప్లీనరీలు ముగిసిన తర్వాత వాటిలో చర్చించిన అంశాలను క్రోడీకరించి, జిల్లా ప్లీనరీలో తీర్మానాలుగా ప్రవేశపెడతామని నాని తెలిపారు. సమావేశంలో పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ముసునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, గుణ్ణం నాగబాబు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, పార్టీ నాయకుడు తోట గోపి పాల్గొన్నారు.

Back to Top