పచ్చకండువాలకే తుపాను సాయం..

శ్రీకాకుళంః పచ్చకండువాలు కప్పుకుంటూనే తుపాను సాయం అందుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను పరిహారం కింద ఇచ్చే చెక్కులు చెల్లడంలేదని మండిపడ్డారు..ఫొటోలకు ఫోజులివ్వడంతో ఉన్న శ్రద్ధ.. నిధులు విడుదల చేయడంలో ఎందుకు ఉండటంలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రుణామాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో కొదవపెట్టిన వస్తువులను రైతులు,మహిళలు తీసుకోలేకపోతున్నారన్నారు. రుణమాఫీ అనేది పచ్చిమోసమని, రైతులందరూ మోసాన్ని గ్రహించలేక ఓట్లు వేశారన్నారు. బ్యాంకులు తమను ఎగవేత దార్లుగా చూస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.అకాలవర్షంతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు రైతులకు నష్టపరిహారం కూడా ఇచ్చి ఆదుకుంటారన్నారు.

తాజా వీడియోలు

Back to Top