వైయ‌స్సార్సీపీ కి అంద‌రూ స‌మాన‌మే

హైద‌రాబాద్‌) వైయ‌స్సార్సీపీ కుటుంబంలో స‌భ్యుల మ‌ధ్య తార‌తమ్యాలు లేవ‌ని  వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ఉచిత కరెంట్ వల్ల ఒక్క తెలంగాణలోనే 75 శాతం మంది లబ్ధిపొందారన్నారు. పార్టీ పేరుతో ఎమ్మెల్యే, ఎంపీ పదవులు పొంది, తల్లిలాంటి పార్టీని వీడిపోయే వారికి కాలమే తగిన గుణపాఠం చెబుతుందన్నారు. 99 మంది క్రియాశీల కార్యకర్తల కోసం పార్టీ ఇబ్బంది కలిగించే ఒకరిద్దరిని పక్కకు పెట్టేందుకైనా వెనకాడబోమన్నారు.
 
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే రైతులు అత్యధిక భాగం ఆత్మహత్యల చేసుకున్నారన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా పార్టీ కార్యక్రమాలు రూపకల్ప చేసి ముందుకు సాగాలని తెలిపారు. జిల్లా నాయకత్వాన్ని డివిజన్, మండల కమిటీలు గౌరవించాలన్నారు. తెలంగాణలో 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎవ్వరిని సూచిస్తే వారే సీఎం అవుతారన్నారు. ప్రభుత్వానికి వాటర్‌గ్రిడ్‌పై ఉన్న శ్రద్ధ, రైతుల రుణమాఫీపై లేదన్నారు. 
 
 ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యద ర్శులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు ఎన్.శాంతికుమార్, అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రెడ్డి, ఇర్మియ, రైతు సంఘం అధ్యక్షుడు హనుమంతు, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకట రమణ, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృత సాగర్, ఐటీ విభాగం అధ్యక్షుడు శ్రీవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
Back to Top