<strong>విజయనగరంః </strong>అగ్రిగోల్డ్ ప్రథమ ముద్దాయి చంద్రబాబే అని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌దేనన్న విషయం అందరికీ తెలుసున్నన్నారు.ఇప్పడు హఠాత్తుగా మాట మార్చడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రోదల్భం ఉందన్నారు.దండుకోవడం,దోచుకోవడమే ప్రభుత్వ పాలసీగా మారిందన్నారు.అగ్రిగోల్డ్ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉందన్నారు.బాధితులకు న్యాయం జరగకుండా వైయస్‌ఆర్‌సీపీ అడ్డుకుంటుందని లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు తప్పులపై తప్పలు చేస్తూ తమ ప్రచార మాధ్యమాలు ద్వారా ఆ తప్పలను ప్రతిపక్షాల మీద నెట్టిసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.అగ్రిగోల్డ్ మోసం వెనుక చంద్రబాబు ప్రభుత్వం అండదండలు ఉన్నాయన్నారు.చంద్రబాబు భరోసాతో అగ్రిగోల్డ్ యాజమాన్యం బరితెగించిందన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. <br/>