వైయస్‌ విగ్రహం పెట్టాడని కక్షసాధింపు

– రేణిగంగవరం గ్రామంలో టీడీపీ నేతల దాష్టికం
– వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన బాధితుడు ఆదాం
 ప్రకాశం: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో కాలనీలో ఏర్పాటు చేయడంతో ఆయనపై టీడీపీ నేతలు కక్షసాధించారు. సామాన్యులపై పాలకులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఉన్న పొలం లాక్కున్నారు. ఉపాధి లేకుండా చేశారు. కేసులు పెడతామని బెదిరించిన సంఘటన ప్రకాశం జిల్లా రేణిగంగవరం గ్రామంలో వెలుగు చూసింది. రేణిగంగవరం గ్రామానికి చెందిన ఆదాం తన గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కక్షగట్టిన టీడీపీ నేతలు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఎకరా 20 సెంట్లు భూమిని ప్రభుత్వ భూమి అంటూ లాక్కున్నారు. ఈ భూమిలో ఆదాం బోరు వేయించుకొని ఉపాధి పొందుతున్నారు. టీడీపీ నేతల తీరుతో ఇప్పుడు ఉపాధి కోల్పోయాడు. ఈ విషయాన్ని ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి బాధితుడు ఆదాం తీసుకెళ్లారు. 


వైయస్‌ఆర్‌పై విఫరీతమైన అభిమానం:ఆదాం
నాకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అంటే నాకు విఫరీతమైన అభిమానం. ఈ అభిమానంతో ఆయన విగ్రహాన్ని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసుకున్నాను. విగ్రహం పెట్టానని నా భూమి టీడీపీ నేతలు లాక్కున్నారు. అందులో మట్టి తవ్వి తమ పొలాలకు తరలించారు. ఎంఆర్‌వో, ఒంగోలు కలెక్టర్‌ను కలిసినా ఎలాంటి ఫలితం లేదు. పెట్రోలు పోసుకొని చనిపోతామని చెప్పినా మా మాట వినడం లేదు. గొడవలు వద్దు..దేవుడు ఉన్నాడని మా అమ్మ చెప్పడంతో మౌనంగా ఉన్నాం. ఇవాళ వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. నాన్నగారి కోసం ఇంత చేసేవు కాబట్టి నీకు అండగా ఉంటానని జననేత హామీ ఇచ్చినట్లు ఆదాం తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top