జౌళి శాఖ ఏడీ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 

ఒంగోలు: అనంతపురం జిల్లా డీఆర్‌డీఏ చేనేత జౌళిశాఖలో అడిషనల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తలారి రంగయ్య  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నలూరు మండలం తిమ్మపాలెంలో జరుగుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో పాల్గొని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రంగయ్య 21 సంవత్సరాలుగా గ్రూప్‌–1 సర్వీసులో పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు నచ్చక  పదవీ విరమణ చేసినట్లు  తెలిపారు.ఈయ‌న చేరిక‌తో క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాలో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top