ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా రాస్తారోకో

తిరుచానూరు: ఆర్టీసి బస్సు చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ తిరుచానూరు పాత బస్టాండు సమీపంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఆర్టీసి బస్సుల అద్దాలను తుడిచి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం ఇటీవలే డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచిందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ తిరుపతి రూరల్ మండల కన్వీనర్ చిన్నియాదవ్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కేశవులు, తిరుపతి రూరల్ మండల సేవాదళ్ కన్వీనర్ చం ద్రశేఖర్ ఆజాద్, నాయకులు శ్రీనివాసులు, నారాయణరెడ్డి, వెంకటరమణ, అప్పన్ననాయక్, రోశిరెడ్డి, దూర్వాసుల రెడ్డి, మల్లికార్జుననాయుడు, శివ, అజ య్, నగీనమ్మ, యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు. 
పెంచిన చార్జీలు పెనుభారం
గుంటూరు: ప్రజలపై భారం మోపడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. బస్ చార్జీల పెంపును నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రదర్శన చేశారు.  ఈ సందర్బంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రయాణికులకు పెంచిన చార్జీలు పెనుభారంగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోతున్నదని విమర్శించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలపై ఎటువంటి భారం మోపలేదని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ షౌకత్, మైనార్టీ సెల్ నగర కన్వీనర్ మార్కెట్‌బాబు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ షేక్ గులాం రసూల్, ఎస్సీ సెల్ నగర కన్వీనర్ వై.విజయ్‌కిషోర్, సేవాదళ్ నగర కన్వీనర్ పల్లపుశివ, పార్టీనేతలు ఎండీ కబీర్, దాసరి శ్రీనివాస్, అత్తోట జోసఫ్‌కుమార్, కంది సంజీవరెడ్డి, కోనూరు సతీష్‌శర్మ, కోటా పిచ్చిరెడ్డి, సూరగాని శ్రీను, మోహమూద్, సమీవుల్లా, షేక్ కరిముల్లా, సుభాని, కారుమూరు అశోక్‌రెడ్డి, కొరిటపాటి ప్రేమ్‌కుమార్, ఆటో యూనియన్ నాయకులు రవి, పవన్, విద్యార్థి నేతలు యు.నర్శిరెడ్డి, పాటిబండ్ల కిరణ్, చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు. 
భారాల సర్కార్‌ను సాగనంపాల్సిందే
విజయవాడ: భారాల ప్రభుత్వాన్ని సాగనంపాలని వైయస్ఆర్ సీపీ యువజన, బీసీ సెల్ విభాగం జిల్లా కన్వీనర్లు అబ్దుల్ రహీమ్, పడమట సురేష్‌బాబు పిలుపు నిచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో కంకిపాడులో ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక ఆటో స్టాండు నుంచి నాయకులు, కార్యకర్తలు బస్టాం డు వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక గన్నవరం రోడ్డు కూడలిలో ధర్నా నిర్వహించారు. రహీమ్, సురేష్‌బాబు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలపై పాలకులు మోయలేని భారాలు మోపుతున్నారని విమర్శించారు.  వైయస్ఆర్ హయాంలో అన్ని వర్గాలూ సంతోషంగా ఉన్నాయన్నారు. ఆయన మరణంతో పథకాలన్నీ అటకెక్కాయని విమర్శించారు. భారాలుమోపటం మానుకోకపోతే పాలకులను సాగనంపేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ మాదు వసంతరావు, నాయకులు మేదండ్రావు కుటుంబరావు, కలపాల వజ్రాలు, బొడ్డు రాజశేఖర్, జి రాజశేఖర్, మృత్యుంజయ శర్మ, వెంకట్రావ్, గుడ్డేటి రాజశేఖర్, తన్నీరు చిన్నా, బాసంశెట్టి రాజశేఖర్, గడ్డం భాస్కర్‌రావు, పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజలకు గులాబీలు పంపిణీ చేశారు.
పెల్లుబికిన ప్రజాగ్రహం
పాలమూరు: ఆర్టీసీ బస్సుచార్జీల పెంపును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. సర్కారు చర్యలను నిరసిస్తూ సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గద్వాల ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌చేశారు.  అచ్చంపేటలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో అలంపూర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు.  

Back to Top