ఆకట్టుకున్న వైయస్ఆర్ టీయూ ప్రదర్శన

ఇబ్రహీంపట్నం: వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా శాఖ తొలి సమావేశం సందర్భంగా ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జోరున వర్షం కురుస్తున్నా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అసంఘటత రంగ కార్మికులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్‌పై, జగన్‌పై తమకు ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ట్రేడ్ యూనియన్ ఏర్పాటు అయ్యాక జిల్లాలో ప్రథమంగా నిర్వహించిన ఈ సమాశానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికులు, దినసరి కూలీలు, స్థానిక ఎన్టీటీపీఎస్‌కు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు గంటల నుంచే కార్మికులు స్థానిక బుడమేటి వంతెన వద్దకు చేరుకున్నారు. వర్షం కారణంగా నేతలు ఆరుగంటలకు అక్కడకు చేరుకున్నారు. వైయస్ఆర్‌ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్ ప్రసాద్, జిల్లా కన్వీనర్ వేజండ్ల శివశంకరావు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు.

ఆకట్టుకున్న రింగు సర్కిల్
సమావేశం సందర్భంగా స్థానిక రింగుసర్కిల్‌ను వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కాంతింతమైన లైటింగ్ ఏర్పాటు చేసి చుట్టూ ఆహ్వాన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఈ రింగుసర్కిల్ హైలెట్‌గా నిలిచింది. అనంతరం స్థానిక ముత్తవరపు వెంకటేశ్వరావు కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ర్యాలీ చేరుకుంది. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేడపాటి నాగిరెడ్డి, శివారెడ్డి, అల్తాఫ్ రాజా, అంకమోహనరావు, పామర్తి వెంకటనారాయణ, కార్మిక సంఘ నాయకులు ఎ.శ్రీనివాసకుమార్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.
Back to Top