8మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఎనిమిదిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను  స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం సస్పెండ్ చేశారు. ఈనెల 23 వరకూ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ కొనసాగనుంది. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు... వైఎస్ఆర్ సీపీ సభ్యులపై సస్పెన్షన్ తీర్మానం ఇచ్చారు.

సభ నుంచి సస్పెండ్ అయినవారు
1.గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి)
2. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి)
3. ముత్యాల నాయుడు (మాడుగుల)
4. కొడాలి నాని (గుడివాడ)
5. సీహెచ్. జగ్గిరెడ్డి (కొత్తపేట)
6. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)
7. శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దుటూరు)
8. చాంద్ బాషా (కదిరి)
కాగా సస్పెన్షన్ను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Back to Top