వైయస్సార్సీపిలో 50 కుటుంబాలు చేరిక

లక్కిరెడ్డిపల్లెః చంద్రబాబు అబద్ధపు హామీలతో విసిగిపోయి టీడీపీ నుంచి 50 కుటుంబాలు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డిల ఆధ్వర్యంలో వైయస్సార్సీపీలో చేరారు.  పార్టీ కండువాలు కప్పివారిని సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం మండలంలోని కుర్నూతల గ్రామం, అగ్రహారం, కాకుళవరం గ్రామం మిద్దెకాడపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు వైయస్సార్సీపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... 30 సంవత్సరాలకు పైబడి టీడీపీని నమ్ముకొని పార్టీకి ఎంతో సేవలు చేశామని క్షేత్ర స్థాయి నాయకులు తమకు చేసిందేమి లేదని అన్నారు.  ఈ విషయాలను నియోజకవర్గస్థాయి నాయకుల దృష్ఠికి తీసుకెళ్లినా ఫలితం లేదని అన్నారు.  వైయస్సార్ ఆశయ సాధనలో భాగంగా జగనన్న పేదల కోసం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులమై వైయస్సార్సీపిలో చేరుతున్నట్లు వారు తెలియజేశారు. జగనన్నను రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసుకుంటామని భరోసా కల్పిస్తూ ఇంటింటింకి తిరిగారు.

Back to Top