<br/><strong>– ఎమ్మెల్యే రాజన్న దొర</strong><strong>– 3 నుంచి ప్రజా సంకల్ప యాత్ర పునః ప్రారంభం</strong><br/>విజయనగరం: జననేత వైయస్ జగన్ రాక కోసం వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నవంబర్ 3వ తేదీన పునః ప్రారంభమవుతున్నట్లు ఆయన తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతేడాది నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారని చెప్పారు. ఇ ప్పటి వరకు వైయస్‌ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో పూర్తి చేసుకొని విజయనగరం జిల్లాలో కొనసాగుతుందన్నారు. గత నెల 25వ తేదీ వైయస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు వచ్చి కత్తితో దాడి చేశారని తెలిపారు. చేతికి తీవ్రగాయమైన వైయస్ జగన్‌కు శస్త్ర చికిత్సలు నిర్వహించారని, ఈ నెల 3వ తేదీ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. జగనన్న ఎలాగున్నారు..ఏం జరిగిందని విజయనగరం జిల్లా ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. గిరిజనులందరూ కూడా మా నాయకుడు రావాలని, మా బాధలు చెప్పాలని ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైయస్ జగన్‌ను ప్రత్యక్షంగా చూడాలని ప్రార్థనలు చేస్తున్నారని, విజయవంతంగా జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం అవుతుందన్నారు. ప్రజా అభిమానమే జననేతకు రక్షణ కవచంగా ఉంటుందన్నారు. ప్రజలందరి అశీస్సులు వైయస్ జగన్‌కు ఉన్నాయని, ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.