బందిపోటు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపండి

తూర్పుగోదావరి: బందిపోటు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ పిలుపునిచ్చారు. రామచంద్రాపురం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను దోచుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలని, దోపిడీ ప్రభుత్వాన్ని పారద్రోలాలని కోరారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మనందరి ప్రభుత్వం వస్తుందని, మనందరం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పారు.
Back to Top