30 రోజుల్లో మొత్తం 388.9 కి.మీలు నడిచిన షర్మిల


ఎమ్మిగనూరు

16 నవంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం'లో శుక్రవారం 30వ రోజు పాదయాత్ర ముగిసింది. నేటి రాత్రికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివార్లలోని గణేశ్ రైస్‌మిల్‌ వద్ద షర్మిల బస చేస్తారు. శుక్రవారం షర్మిల 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 30 రోజుల్లో మొత్తం 388.9 కి.మీల దూరం నడిచారు.
శుక్రవారం ఉదయం హెచ్.మొరవని నుంచి  ప్రారంభమైన షర్మిల పాదయాత్ర నాలుగో మైలు క్రాస్,
ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ రోడ్డు, శ్రీనివాస్ సర్కిల్, ట్యాంక్‌బండ్ రోడ్,
సోమప్ప సర్కిల్, జామియా మసీదు, ఎంబీ చర్చి, కలుగట్ల రోడ్డు మీదుగా గణేష్
రైస్‌మిల్లు చేరుకుంది. సోమప్ప సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. నేటి పాదయాత్రలో మంత్రాలయం
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి
పద్మ తదితరులు పాల్గొన్నారు.

Back to Top