26న కాకినాడకు అన్నొస్తున్నాడు

కాకినాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26వ తేదీన కాకినాడలో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పర్యటించనున్నట్లు చెప్పారు. పలు చోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని కన్నబాబు తెలిపారు. ఎన్నికల సందర్భంగా కనీసం రెండు మూడు రోజుల పాటు వైయస్‌ జగన్‌ పర్యటించేలా ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వినాయక చవితి పండుగ కారణంగా ప్రజలకు ఇబ్బందికలగకూడదనే ఉద్దశంతో ఒక్క రోజుకే పరిమితం చేశామని చెప్పారు.
 
Back to Top