25, 26 తేదీల్లో పులివెందులలో విజయమ్మ

పులివెందుల : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ఈనెల 25, 26 తేదీల్లో పులివెందులలో ఉంటారు. 25వ తేదీన పులివెందుల రానున్న శ్రీమతి విజయమ్మ ఆ రెండు రోజులూ పులివెందుల నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటారని పార్టీ నాయకుడు వైయస్ భాస్క‌ర్‌రెడ్డి తెలియజేశారు. పులివెందులలోని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో‌ విజయమ్మ అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు, వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
Back to Top