236.1 కి.మీలు నడిచిన షర్మిల

అనంతపురం 4 నవంబర్ 2012: షర్మిల 18వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర
ముగిసింది. ఆదివారం ఆమె 12.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు ఆమె మొత్తం 236.1
కిలోమీటర్లు నడిచారు. ఇదిలావుండగా షర్మిల మరో ప్రజాప్రస్థానం పాద యాత్రకు జనం బ్రహ్మరథం
పడుతున్నారని, ఎన్నికలు
ఎప్పుడొచ్చినా వైయస్ఆర్ సీపీదే విజయమనీ పార్టీ సిజిసి సభ్యురాలు కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని ఆమె అన్నారు. తెలంగాణలో జనం తెరాసను నమ్మబోరనీ, అక్కడ కూడా
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ బలోపేతమౌతోందనీ, విజయవంతమైన భువనగిరి సభే ఇందుకు
నిదర్శమనీ సురేఖ వ్యాఖ్యానించారు.

Back to Top