1న వైయస్‌ఆర్‌సీపీ రక్తదాన శిబిరాలు

హైదరాబాద్, 24 సెప్టెంబర్‌ 2012: జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం అక్టోబర్ 1న రాష్ట్ర‌ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్‌ ‌శివభారత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. శివభారత్‌ రెడ్డి సోమవారంనాడు హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అక్టోబర్‌ 1న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని శివభారత్‌రెడ్డి పార్టీ వైద్య విభాగం బాధ్యులను కోరారు.

Back to Top