12న ప.గో జిల్లాకు షర్మిల యాత్ర

ఖమ్మం, 06 మే 2013:

శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 12న పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశించనుంది. 25 రోజుల పాటు 13 నియోజకవర్గాలలో 225 కిలోమీటర్ల పాటు పాదయాత్ర సాగుతుంది. చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం గ్రామం వద్ద యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. వారం రోజుల రూట్ మ్యాప్‌ను ప్రకటించారు. కామవరపు కోట వద్ద షర్మిల యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంటుంది. పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, ముదునూరు ప్రసాదరాజు ఈ వివరాలను వెల్లడించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల కిందటేడాది అక్టోబర్ 18న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంతవరకూ కడప, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాలో యాత్రను ముగించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో యాత్ర సాగిస్తున్నారు.

Back to Top