జైత్ర‌యాత్ర‌


- ప్ర‌కాశం జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- వైయ‌స్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం
- పోటెత్తిన పాద‌యాత్ర దారులు
- ఇవాళ ప‌ర్చురు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  
ప్ర‌కాశం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర ద్వారా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇవాళ్టికి 105వ రోజుకు చేరింది. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఇవాళ సాయంత్రం ప‌ర్చురు నియోజ‌క‌వ‌ర్గంలోని వైయ‌స్ జ‌గ‌న్ అడుగుపెడ‌తారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌నేత పాల్గొని ప్ర‌సంగిస్తారు.

హార‌తులిచ్చి ఆత్మీయ స్వాగ‌తం..
ప్ర‌కాశం జిల్లాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర అపూర్వ ఆదరణతో ముందుకు సాగుతోంది. మా గుండె చప్పుడు నీవేనయ్యా అంటూ అడుగడుగునా జనం వైయ‌స్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. అందరినీ పేరు పేరునా పలకరిస్తూ సమస్యలు ఏకరువు పెట్టిన వారికి తానున్ననంటూ భరోసానిస్తూ వైయ‌స్‌.జగన్‌ యాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉద‌యం త‌క్కెళ్ల‌పాడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం అయ్యింది. జె.పంగ‌లూరు గ్రామంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 2.30 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. అశేష జ‌న‌వాహిని త‌ర‌లిరావ‌డంతో వారంద‌రి సమ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ తెలుసుకొని భ‌రోసా క‌ల్పించారు. మార్గ‌మ‌ధ్య‌లో రైతు సంఘాల నాయ‌కులు క‌లిసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.  దారి పొడవునా జనం జగన్‌కు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top