<strong>విజయనగరంః</strong> రాష్ట్రానికి జగన్ లాంటి నాయకుడు కావాలని వైయస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్ రత్నాకర్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రపై దేశ,విదేశాల్లో చర్చ జరుగుతున్నదని, ప్రపంచదేశాల్లో ఉన్న తెలుగువారందరూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అవినీతిమయం అయిన ఈ రాష్ట్రాన్ని జగన్ ఒక్కరే కాపాడాగలరన్నారు. తెలుగువారందరూ ఇదే అభ్రిపాయంతో ఉన్నారని స్పష్టమవుతోందన్నారు. వైయస్. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్‌ఆర్ పాలన మళ్లీ చూడవచ్చనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు.వైయస్ జగన్ పట్టుదల, దృఢసంకల్పం, నాయకత్వాలను ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. చంద్రబాబు పేరు చెప్పితే వెన్నుపోటుతో బాటు అవినీతి, అక్రమం, అరాచకం వంటి పదాలు గుర్తుకువస్తాయన్నారు.