ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌

గుంటూరు: సత్తెనపల్లి వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అబంటి రాంబాబు మరోసారి కరోనా బారినపడ్డారు. జలుబు, ఇతర లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయనకు ఇంతకుముందు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. 

తాజా ఫోటోలు

Back to Top