చింతమనేని వ్యాఖ్యలు చంద్రబాబు సమర్థించడం సిగ్గుచేటు

చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

వైయస్‌ఆర్‌సీపీ నేతలు హెచ్చరిక..

పశ్చిమగోదావరి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై ఏం చర్యలు తీసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కొఠారు అబ్బయ్య చౌదరి, రంగారావు,సుధీర్‌బాబులు ప్రశ్నించారు. పోస్ట్‌ షేర్‌ చేసిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై కేసు పెట్టడం దారుణమన్నారు. అరెస్ట్‌ చేసిన కత్తుల రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చింతమనేని పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. చింతమనేని వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించడం సిగ్గుచేటన్నారు. చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Back to Top