వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలపై ఎస్‌ఐ దౌర్జన్యం

అనంతపురం: టీడీపీ నేతలు పోలీసుల అండతో  వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.అమడగూరు ఎస్ఐ రాఘవయ్య.. వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై  దౌర్జ‌న్యానికి పాల్పడ్డారు. జేకేపల్లికి చెందిన 12 మంది వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను బైండోవర్‌ చేశారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీ  ప్రయోగించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు. ఆరుగురు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు గాయాలతో కదిరి ఆసుప్రతిలో చేరారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఆదేశాలతోనే వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను బైండోవర్‌ చేశారని ఎస్‌ఐ రాఘవయ్యపై ఆరోపణలు వస్తున్నాయి.

Back to Top