హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం:ప్రత్యేకహోదాపై చంద్రబాబు సర్కార్‌కు చిత్తశుద్ధిలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు.గతంలో హోదా పోరుకు కలిసిరాకుండా..నేడు హోదా కోసమంటూ సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.అఖిలప„ý  సమావేశంలో చంద్రబాబు ఏకాకిగా మిగిలిపోయారన్నారు.వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో త్వరలో వాస్తవాలు బయటకొస్తాయన్నారు.ప్రత్యేకహోదాపై టీడీపీ పాటు పడుతున్నట్లు ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారని దుయ్యబట్టారు.గతంలో ప్రత్యేకహోదా అవసరం లేదని ,ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని తెలిపిన చంద్రబాబు మాటలు ప్రజల మరిచిపోలేదన్నారు.హత్యా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

Back to Top