కమీషన్ల కోసమే ప్లెమింగో ఫెస్టివల్‌...

వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌...

నెల్లూరు:టీడీపీ నేతల కమీషన్ల కోసమే కోట్లాది రూపాయలను ప్లెమింగో ఫెస్టివల్‌కు కేటాయిస్తున్నారని మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు.మూడు రోజులు టీడీపీ నేతలు హడావుడి చేయడం తప్పా పర్యాటకులకు సదుపాయాలు కల్పించడం లేదన్నారు.పులికాట్‌ సరస్సు ముఖద్వారాలలో పూడికతీతపై చంద్రబాబు,మంత్రులు హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీలేదన్నారు.ప్లెమింగో పెస్టివల్‌కు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు ఆహ్వానం పంపకపోవడం టీడీపీ నేతల తీరుకు నిదర్శనమన్నారు.స్వదేశీ దర్శన్‌ నిధుల్లోనూ టీడీపీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారన్నారు.

 

Back to Top