బాబు ఏం మాట్లాడుతున్నాడో ఆయ‌న‌కే తెలియ‌దు

వైయ‌స్ఆర్‌సీపీ నేత  కారుమూరి నాగేశ్వ‌ర‌రావు
 

పశ్చిమ గోదావరి: చంద్రబాబు నాయుడు పూట‌కో మాట మాట్లాడుతున్నార‌ని, ఆయ‌న ఏం మాట్లాడుతున్నాడో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత  కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విమ‌ర్శించారు. తన స్వలాభం కోసం  ఏ పార్టీతో అయినా కలిసిపోయే రాజకీయ పచ్చి వ్యభిచారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  శనివారం ఆయ‌న‌ ద్వారకా తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం వైయ‌స్‌. జగన్‌ మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తుంటే దానిని జగన్ కేసీఆర్ కలిసి పోటీ చేసే అంత ఇదిగా అల్లరి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని పై గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ద్వారకా తిరుమల వస్తే ఆయనకి మీ పార్టీ జిల్లా కార్యదర్శి స్వాగతం పలకడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌ని తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని మీరు అడిగితే ఆయన  ఛీ ఛీ అంటూ మిమ్మల్ని ఛీ కొట్టారని ఆయన అన్నారు.

 

Back to Top