ప్రజల వెతలకు పాదయాత్రలోనే పరిష్కారం

పాదయాత్రలో ప్రతి రోజూ 25 వేల మందిని కలిసిన వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

శ్రీకాకుళం: నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కంటే మిన్నగా వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ప్రజల వెతలకు పరిష్కారం కనుగొన్నారని  వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎంతో మందికి భరోసా  ఇచ్చిందని ప్రజా సంకల్ప యాత్రకు వచ్చిన స్పందన అపూర్వమన్నారు. పాదయాత్రలో ప్రతి రోజూ 25 వేల మందిని జననేత కలిశారన్నారు. అందరి కష్టాలు తెలుసుకుని..అందరికీ ధైర్యం చెప్పారన్నారు. వైయస్‌ జగన్‌పై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారన్నారు.

వైయస్‌ జగన్‌ మాత్రమే సమస్యలు పరిష్కారం చూపగలరని నమ్ముతున్నారని చెప్పారు. భారత దేశ రాజకీయాల్లో అత్యద్భుతంగా సాగిన పాదయాత్ర వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర అన్నారు. పురాణ కాలంలో రుషులంతా కూడా పాదయాత్ర ద్వారానే తమను తాము పునీతం చేసుకొని అధ్యాత్మిక వేత్తలుగా మారి ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వాన్ని ఇచ్చిన సాంప్రదాయం ఉన్న దేశంలో వైయస్‌ జగన్‌ 3600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. జననేత తనను తాను పునీతం చేసుకుంటూ..ఒక కడిగిన ముత్యంలా మారారన్నారు. ఆరోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కంటే మిన్నగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేశారన్నారు. ప్రజలు పడుతున్న వెతలకు పరిష్కారం కనుగొన్నారన్నారు. ఇది అద్భుతమైన రాజకీయ పరిణామన్నారు. 

 

Back to Top