వైస్ ఎంపీపీగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి ఏక‌గ్రీవ ఎన్నిక‌

పార్వ‌తీపురం: పార్వతీపురం మండలం ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు - 2 ఉపఎన్నిక ఏకగ్రీవమైంది. స్థానిక ఎమ్మెల్యే  అలజంగి జోగారావు సమక్షంలో పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రత్యేక అధికారికి బి - ఫారమ్ అందజేశారు. ఎంపీటీసీ సభ్యులు అంతా కలిసి సమ్మతి తెలుపుతూ మండల ఉపాధ్యక్షులు - 2 గా బంకూరు రవి కుమార్ ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంత‌రం ర‌వికుమాత్‌తో ఎన్నిక‌ల అధికారి ప్ర‌మాణం చేయించారు.  కార్యక్రమంలో ఎంపీపీ మజ్జి శోభారాణి, జెడ్పీటీసీ సభ్యులు బలగ రేవతమ్మా, వైస్ ఎంపీపీ1 సిద్ద జగన్నాధ రావు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top