అవసరమైతే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించండి

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి
 

తిరుమల: శ్రీవారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులకు అనారోగ్యంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  అధికారులను ఆదేశించారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్షించనున్నట్లు తెలిపారు. 

Back to Top