రేపు వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం గురువారం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 21న అసెంబ్లీ సమా­వేశాల దృష్ట్యా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య­క్షులు వైయ‌స్‌ జగన్‌ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.

ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్ల­మెంట్‌ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్య­ర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశాని­ర్దేశం చేయనున్నారు. అలాగే జూన్‌ 19నాటి పులివెందుల పర్యటనను వైయ‌స్‌ జగన్‌ వాయిదా వేసుకున్నారు.

Back to Top